
* జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్‌కుమార్, జస్టిస్ సుజన నియామకం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి(Justice Laxminarayana Alisetti), జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి(Justice Anilkumar Jukanti), జస్టిస్ సుజన కలసికం(Justice Sujana Kalasikam) కాసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు జడ్జీలుగా పనిచేస్తున్న వీరిని పర్మినెంట్ న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఆ ముగ్గురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు మొదటి కోర్టు హాలులో తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ (Justice Sujay Paul) వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
…………………………………