
* తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి
* పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విషాదం
ఆకేరు న్యూస్, పెద్దపల్లి : ఏమైందో ఏమో మూడేళ్ల కుమార్తెను ఉరేసి చంపేసింది. ఆ తర్వాత తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లి (Peddapalli) జిల్లా కేంద్రంలో ఈ ఘటన విషాదం నింపింది. జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. నాలుగు ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లా (Karimnagar District) వెధిర గ్రామానికి చెందిన సాహితీని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. పెద్దపల్లి పట్టణంలోని టీచర్స్ కాలనీలో వేణుగోపాల్ రెడ్డి, లోక సాహితి రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. వేణుగోపాల్ జగిత్యాల(Jagityala)లోని తమ సమీప బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. దీంతో రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో సాహితి తన కూతురు రితన్యకు ఉరివేసి(Hanging) చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………………..