* రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆరా
ఆకేరు న్యూస్, ఖమ్మం : ఖమ్మం జిల్లా అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (TUMMALA NAGESWARA RAO) ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా జిల్లాలో తిరుగుతూ రోడ్లపై ఆరా తీశారు. ఎక్కడెడెక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి.. కొత్తవి ఎక్కడ వేయాలి.. మరమ్మతులు చేయాల్సినవి ఏవి.. అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెంలో అటవీ పార్కుల అభివృద్ధిపై చర్చించారు. అలాగే ఆయిల్ పామ్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే కల్లూరు గూడెంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజీవ్ కెనాల్ ప్రతిపాదన చేయగానే సీఎం రేవంత్‌రెడ్డిని అడగానే ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కొందరు అడ్డుపడ్డా సీఎం రేవంత్ (CM REVANTH) పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేశారని తెలిపారు. భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆశీస్సులతో తన జీవితం ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి, ప్రజా సేవ కోసమేనని ఉద్ఘాటించారు. గత కేసీఆర్ (KCR) ప్రభుత్వం అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. రైతు రుణమాఫీ రైతు భరోసాతో సీఎం రేవంత్ చరిత్రలో నిలిచారని అన్నారు. తెలంగాణ పచ్చగా మారాలంటే ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
………………………………………
