
* గనుల్లో యంత్రాల వినియోగాన్ని పెంచాలి
* సింగరేణి సీఎండి బలరాం నాయక్
* భూపాలపల్లి ఏరియా గనుల ఆకస్మిక తనిఖీ
ఆకేరున్యూస్, భూపాలపల్లి:యంత్రాల వినియోగాన్ని పెంచి నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించాలని సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ నాయక్ అన్నారు. గురువారం సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్,, సత్యనారాయణ, సూర్యనారాయణ, కొప్పుల వెంకటేశ్వర్లు భూపాలపల్లి గనులలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ నాయక్ మాట్లాడుతూ… సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ తమకు కేటాయించిన విధులను తప్పనిసరిగా ఎనిమిది గంటల సమయంలో నిర్వర్తించాలని, భారీ యంత్రాల వినియోగ సమయాన్ని పెంచాలని సూచించారు.సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా హాజరవుతూ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, అలాగే గనులలో వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో చైర్మన్ మాట్లాడి వారికి కావలసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అందరూ కూడా పనిలో అలసత్వాన్ని వదిలి ఉత్సహంగా పని చేయాలని, విధులకు గైర్హాజరు కావడం వలన సంస్థకు అలాగే వారి కుటుంబాలకు కూడా నష్టం జరుగుతుందని తెలిపారు. మీకు కావలసిన అన్ని వనరులు పరికరాలు, అవసరమైన ఎస్ డి ఎల్ యంత్రాలను సాంక్షన్ చేస్తామన్నారు.ఆసుపత్రుల అడ్మినిస్ట్రేషన్ కు మిలిటరీ డాక్టర్ ను నియమిస్తామని చెప్పారు. సంస్థలో మహిళా ఉద్యోగులు పెరుగుతున్న సందర్భంగా వారికి కావలసిన అన్ని ఏర్పాట్లను సంస్థ చేస్తుందని, అలాగే మహిళా ఉద్యోగులు ఉత్పత్తి ఉత్పాదకతకు కృషి చేయాలని, వారు వివిధ కేటగిరీల ఉద్యోగాలను చేస్తూ ఉండాలని, భూగర్భంలో కూడా దిగి సంస్థ ఉత్పత్తి ఉత్పాదకు తోడ్పడాలని సూచించారు. సంస్థలో చేరిన మహిళలకు ఇ.పి ఆపరేటర్లుగా వెళ్లడానికి అవకాశం ఉందని దానిని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. గనులలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు భద్రతతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదక సాధించే దిశగా పని చేయాలని, గనిలో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడటం జరిగింది. కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి, మనోహర్ (జిఎం సిపిపీ), జిఎం (యుజిమైన్స్) రఘునాథ రెడ్డి, ఎస్ఓ టు జిఎం కవీంద్ర, ఓసి-2 పిఓ వెంకటరామరెడ్డి , ఏజెంట్ కేటీకే -1 గ్రూప్ వెంకట రమణ , కేటీకే 5 మేనేజర్ జాకీర్ హుస్సేన్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసి జనరల్ సెక్రటరీ పి.రాజేందర్ తో పాటు వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………