 
                * కోడలిపై అత్తా మామలు,తోటి కోడలు వేధింపులు
* ఏలూరు జిల్లాలో అమానుషం
ఆకేరు న్యూస్, డెస్క్ : కట్నం కోసం కోడళ్లను వేధించడం చూశాం, ఆడ పిల్లను కన్నందుకు కోడళ్లను రాచిరంపాన పెడుతున్న అత్తమామలను చూశాం కానీ చేసుకున్న మొగుడు కాకుండా అతని సోదరుడి కోరిక తీర్చాలంటూ కోడలిని నరకయాతనకు గురిచేసిన సంఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగింది. భర్త సోదరుడిని సుఖ పెట్టాలని వివాహితను అత్తామామలు, తోడికోడలు వేధింపులకు గురిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం రంజిత్ కుమార్ అనే వ్యక్తితో మహిళకు వివాహం జరిగింది. వీరికి ఏడాది కొడుకు ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులు ఓ విషయంపై అత్తమామలతో పాటు తోటి కోడలు కూడా మహిళను చిత్రహింసలు పెడుతున్నారు. భర్త సోదరిడితో మరొక వారసుడికి జన్మినివ్వాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సదరు మహిళ ఒప్పుకోకపోవడంతో ఆమెను 10 రోజులు గదిలో నిర్బంధించారు. మహిళతో పాటు ఏడాది కొడుకును కూడా గదిలో బంధించారు. బంధించిన గదికి కరెంట్ , బాత్రూమ్, నీరు , తిండి లేకుండా అత్తంటి వారు అతి దారుణంగా ప్రవర్తించారు. ఈ విషయం కాస్తా హ్యూమన్ రైట్స్ సభ్యులకు తెలిసింది. దీంతో వారు మహిళ ఇంటికి చేరుకొని మహిళను విడిపించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
……………………………………………………

 
                     
                     
                    