
బీజేపీ ఎంపీ బండి సంజయ్
* దేశభద్రతకు భంగం కలిస్తే.. కఠిన చర్యలు..
* తెలంగాణా నేతలకు బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆకేరున్యూస్, హైదరాబాద్ : దేశ భద్రతకు భంగం కలిగిస్తే..ఎవరినైనా సరే.. వదిలే ప్రసక్తే లేదని కేంద్ర
హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మావోయిస్టు నేతలకు సహకరిస్తున్న రాజకీయ నాయకుల సంగతి సైతం తేలుస్తామని తెలంగాణ నేతలకు ఎక్స్ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్య ముసుగులో మావోయిస్టులకు మద్దతునిస్తున్న నాయకులారా మీ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. కేంద్ర హో మంత్రి అమిత్ షా నేతృత్వంలో పనిచేస్తోన్న సంస్థలు నక్సలైట్లను అంతం చేసేందుకే కాదని.. దేశానికి సవాల్‌గా మారిన ఉగ్రవాదంపై పోరాడుతోందని గుర్తు చేశారు. అంతర్గత భద్రత విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని.. దేశరక్షణకు ముప్పు కలిగిస్తే.. కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
…………………………………..