
* అతి సహనం మంచిది కాదు
* ఎప్పటికీ కశ్మీర్ భారత్లో భాగమే
* ఉగ్రవాదుల ఏరివేతలో ఎన్డీఏకు మద్దతుగా నిలవాలి
* ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆకేరు న్యూస్, మంగళగిరి : మత ప్రాతిపదికన చంపడాన్ని సహించబోమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan Kalyan)తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తూ మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పవన్ కల్యాణ్ అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్లో ఉగ్రదాడి (Terrorist Attack) జరిగితే ఆ ప్రకంపనలు మనకు తగిలాయన్నారు. దేశంలో సహనం ఎక్కువైందని, అతి సహనం మంచిది కాదని హితవు పలికారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపినా, పాక్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. పాక్కు అనుకూలంగా మాట్లాడాలంటే పాక్ వెళ్లిపోండని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదన్నారు. ఎప్పటికీ కశ్మీర్ భారత్లో భాగమే అన్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో ఎన్డీఏ(NDA)కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
…………………………………………………………