
* రేపటి నుంచే అమల్లోకి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు(OUTER RING ROAD)పై టోల్ ఛార్జీలను పెంచుతూ ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ (IRB INFRA LIMITED) సంస్థ నిర్ణయం తీసుకుంది. కారు, జీపు, వ్యాన్, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఛార్జీలు రూ.2.34 నుంచి రూ.2.44కు పెరిగింది. ఇక మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్‌కు రూ.3.77 నుంచి రూ.3.94కు పెంచారు. 2 యాక్సిల్ బస్సులకు కిలో మీటర్ కు రూ.6.69 నుంచి రూ.7కు పెంచారు. భారీ వాహనాలకు కిలో మీటర్ కు రూ.15.09 నుంచి రూ.15.78కి పెంచారు. పెరిగిన ధరలు రేపటి నుంచి అంటే 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్‌జీసీఎల్) నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఐఆర్బీ సంస్థ గత సంవత్సరం 30 ఏళ్లకు లీజుకు తీసుకుంది. అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఏడాది టోల్ ఛార్జీలను పెంచుకునే అవకాశం ఉంది.
…………………………………………..