* అదనపు షోలకు అనుమతినిచ్చిన డివిజన్ బెంచ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రాల నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది.. ఈ ఏడు సంక్రాంతికి మెగా స్టార్ నటించిన మన శంకర వర ప్రసాదా గారు, ప్రభాస్ నటించిన రాజాసాబ్ లు విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలకు కోసం అటు మెగాస్టార్ అభిమానులు ఇటు ప్రభాస్ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన సీన్స్ సందడి చేస్తున్నాయి. సంక్రాంతి వేళ ఈ సినిమాలకు అదనపు షోలకు అనుమతి ఇస్తారో లేదో అనే అనుమానం సినిమా నిర్మాలకు.. ప్రేక్షకులకు ఉంది.వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ హైకోర్టు అదనపు షోలు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది, అదనపు షోల విషయంలో గతంలో సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఈ సినిమాలకు వర్తించదని కోర్టు పేర్కొంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు గేమ్ చేంజర్, పుష్ప 2, ఓజీ, అఖండ 2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేసినట్లు తెలిపింది. దీంతో అటు సినిమాల నిర్మాతలు ఇటు ప్రేక్షకులు ఊపిరి తీసుకున్నారు. ఇక సంక్రాంతికి సందడే సందడి…
………………………………………….
