* నేలకొరిగిన చెట్లు, పంట పొలాలు
ఆకేరున్యూస్ డెస్క్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టోర్నాడో బీభత్సం సృష్టించాయి. దీంతో భారీగా చెట్లు విరిగిపడడంతో పాటు పంట పొలాలు ధ్వంసమయ్యాయి. పత్తి, మిరప మొక్కలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అకస్మాతుగా దూసుకొచ్చిన భారీ గాలులు సృష్టించిన విధ్వంసం చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టోర్నడో తరహాలో వీచిన గాలుల ధాటికి అటవీ ప్రాంతంలోని భారీ వృక్షాలు సైతం నెలకొరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో టోర్నడో బీభత్సం సృష్టించింది. అయితే నాడు ఇంత పెద్ద విధ్వంసం జరిగినా అక్కడి జంతువులు, పక్షులు మాత్రం ఈ విపత్తును ముందే పసిగట్టి ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాయి. టోర్నాడో ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
……………………………
