
* మధ్యాహ్నం నుంచి ఆలయాల దర్శనం నిలిపివేత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీ ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆదివారం రాత్రి 8.58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 8వ తేది తెల్లవారు జామున 2.25 గంటలకు ముగుస్తుంది. కాగా, 7వ తేదీ రాత్రి 9.57 గంటలకు పాక్షిక దశను, సంపూర్ణ గ్రహణ దశ రాత్రి 11.01 గంటకు ప్రారంభమై అర్ధరాత్రి 2.23 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాపంగా ఉన్న ఆలయాలన్నింటిని మూసివేయనున్నారు. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శనాలకు ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు అనుమతిస్తారు. అనంతరం ప్రధాన, ఉప, అనుబంధ ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి సోమవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయ సంప్రోక్షణ చేసి, బిందె తీర్థం, బాల భోగం, నిజాభి సహస్రనామార్చన నిర్వహించి దర్శనాలకు అనుమతిస్తామన్నారు.
……………………………………….