
* సీఎం ఆదేశాలతో ప్రత్యేక కార్యాచరణ
* వేయి స్తంభాల గుడి వద్ద అట్టహాసంగా బతుకమ్మ
* పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
* హైదరాబాద్లో ట్రావెల్, టూరిజం ఫెయిర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పర్యాటకం పరంగా ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉన్న తెలంగాణను మరింత అభివృద్ధి చేసేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశామని, అది అమల్లోకి వచ్చిన వెంటనే టూరిజం పరుగులు తీయనుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తెలిపారు. హైదరాబాద్ (HYDERABAD) మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ ప్రారంభానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతాయని వెల్లడించారు. తొలిరోజు వేడుకలను హన్మకొండలోని చారిత్రక వేయి స్తంభాల గుడి వద్ద ప్రారంభిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ (CONGRESS) ప్రభుత్వం నూతన పర్యాటక విధానాన్ని తెచ్చిందని, ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్థికి దోహద పడేలా తీర్చిదిద్దుతామని వివరించారు. టూరిస్టులు తెలంగాణ(TELANGANA)కు వచ్చేటప్పుడు అవకాశాలను ప్యాకేజీ చేయడంలో భాగస్వాములు కావాలని, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని పిలుపునిచ్చారు.
…………………………………