
ఆకేరున్యూస్, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనలో చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యల ద్వారా ఇద్దరి మృతదేహాలను గుర్తించగా.. గురువారం కేడవార్ డాగ్స్‌ను తెప్పించి మరోసారి సొరంగంలో పరిశీలించారు. దుర్వాసన వల్ల మృతదేహాలను గుర్తించకపోయినట్టు సమాచారం. శుక్రవారం ఏడున్నర గంటల ప్రాంతంలో రెస్క్యూ బృందాలు మరోమారు టన్నెల్లోకి సహాయక చర్యలు చేపట్టేందుకు బయలుదేరాయి. రెస్క్యూ బృందాలు మధ్యాహ్నం తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉండడంతో మనోజ్‌కుమార్ మృతదేహానికి సమీపంలో మరో వ్యక్తి డెడ్ బాడీ వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం శివశంకర్ అనే ఓ ప్రత్యేక అధికారిని నియమించింది. గత మూడు రోజులుగా ఆయన సమక్షంలోనే రెస్క్యూ బృందాలు సొరంగంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి.
…………………………………………………