
* ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాల గుర్తింపు
* ఏపీలోని ముమ్ముడివరంలో ఘటన
ఆకేరు న్యూస్, అమరావతి : పెళ్లి కోసమని స్నేహితుడి ఇంటికి వెళ్లిన 8 మంది యువకులు గోదావరి నదిలో ఈతకు దిగి గల్లంతు అయ్యారు. వారిలో కొందరు ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. ఈరోజు ఉదయం ఐదుగురి మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తూర్పు గోదావరిలో ఆ విషాదం చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంకకు పెళ్లి కోసమని వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు. లోతైన ప్రాంతం కావడంతో 8 మంది గల్లంతుకాగా మరో ముగ్గురు సురక్షితంగా బయటకు వచ్చారు. గల్లంతైన వారు క్రాంతి, పాల్, సాయి, మహేష్, సతీష్, మహేష్, రాజేష్, రోహిత్ లుగా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది గుర్తించారు. నదిలోంచి వెలికితీశారు. చనిపోయిన వారు కాకినాడ, మండలపేటకు చెందిన యువకులుగా గుర్తించారు.
………………………………………