* హనీమూన్ వెళ్లొచ్చిన నవదంపతులు దుర్మరణం
* మరో ఇద్దరు మృతి
ఆకేరు న్యూస్ డెస్క్ : కేరళలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన అయ్యప్ప స్వాముల బస్సును కారు ఢీకొట్టిన ప్రమాదంలో నవదంపతులు సహా నలుగురు మృతి చెందారు. 15 రోజుల క్రితమే వివాహం చేసుకున్న ఆ దంపతులు హనీమూన్‌కు మలేషియా వెళ్లి కేరళలో నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కేరళ(KERALA)లోని పథానంతిట్టకు చెందిన అను, నిఖిల్‌కు 15 రోజుల కిందట వివాహమైంది. పెళ్లి తర్వాత హనీమూన్‌కు మలేషియా(MALAYSIA)కు వెళ్లి ఈరోజు తిరిగి కేరళకు వచ్చారు. ఈ క్రమంలో తిరువనంతపురంలో కొత్త దంపతులను రిసీవ్ చేసుకోవడానికి నిఖిల్ తండ్రి మథాయ్ ఈపన్, అను తండ్రి జార్జ్ బిజులు వెళ్లారు. వారంతా కారులో బయల్దేరి సొంతూరికి వెళ్తుండగా ఆదివారం ఉదయం 4.05 గంటల ప్రాంతంలో పనలూరు-మువట్టుపుజ రహదారిపై పథానంతిట్ట జిల్లా మురింజకల్ వద్ద ప్రమాదం (ACCIDENT)జరిగింది. తెలంగాణ(TELANGANA)కు చెందిన అయ్యప్ప భక్తులు వెళ్తున్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నిఖిల్, జార్జ్ బిజు, ఈపన్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అను మృతి చెందింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా పలువురు అయ్యప్ప భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
…………………………….