
* రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి (Teegala Krishnareddy) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన ప్రమాదంలో కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి(19) మృతి చెందాడు. హైదరాబాద్ శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్(orr)పై వేగంగా వచ్చిన కారు.. ముందున్న లారీని ఢీకొట్టటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న కనిష్క్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. వాహనదారులు స్పందించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.కనిష్క్ రెడ్డి బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్ కు హాజరై బెంజ్ కారు(Benz car)లో ఇంటికి బయలుదేరాడు. అమ్మ ఫోన్ చేస్తే.. రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటానని చెప్పి… మృత్యుఒడికి చేరాడు.
………………………………………..