
* బైకును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఆకేరు న్యూస్, జహీరాబాద్: బంధువుల ఇంటికి వెళ్లొస్తుండగా.. అనుకోని ప్రమాదంలో ఆ యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ బస్సు రూపంలో వారిని మృత్యువు కబళించింది. జహీరాబాద్ (Jaheerabad)మండలం అర్జునాయక్ తాండాకు చెందిన రాథోడ్ శంకర్, పవన్ జహీరాబాద్ నుంచి సిద్ధాపూర్ తాండాలోని తమ బంధువుల ఇంటికి వెళ్లిరు. తిరుగుప్రయాణంలో బైకుపై వస్తుండగా గొట్టిగార్‌పల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఎదురుగా వస్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
…………………………………