
* రెప్పపాటులో తప్పిన ప్రాణనష్టం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్లో పార్క్ చేసి ఉన్న ఒక రైలు బోగీలో కొందరు కార్మికులు నిద్రపోతున్నారు. అకస్మాత్తుగా బోగీకి నిప్పు అంటుకుంది. నిద్రిస్తున్న వారిలో మెలుకువ వచ్చి మిగతా వారిని అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం తప్పింది. కేసముద్రం రైల్వే స్టేషన్ (Kesa samuderam Railway Station) లో మూడవ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడే ఓ రైలు బోగీని పార్క్ చేశారు. నిర్మాణ పనుల్లో పాల్గొన్ని కొందరు కార్మికులు రాత్రి అందులో నిద్రించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆ బోగీకి నిప్పు అంటుకుంది. మంటలు చెలరేగి ఒక్కసారిగా బోగి మొత్తం వ్యాపించాయి. అంతలోనే అందులో నిద్రిస్తున్న వారు బయటకు పరుగులు తీశారు. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే బోగీ మంటల్లో కాలిపోయింది. భోగి మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ ల్ ఉన్న బోగీకి అంత ఎత్తున మంటలు చెలరేగడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
………………………………………..