
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం స్థానిక ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఎన్నికలలో పాల్గొనే సిబ్బందికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాబోయే స్థానిక ఎన్నికలలో ఎన్నికలు నిర్వహణ ,ఎన్నికలకు సంబంధించిన నియమావళి, ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది విధుల గురించి పిఓలు, ఏపీవోలు, ఆర్వోలు, ఏఆర్ఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఎల్పిఓ గంగాభవాని, ఎంఈఓ కే. శ్రీధర్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది పాల్గొన్నారు.
………………………………………………