ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కవితను అరెస్టు చేశారు. తెలంగాణ జాగృతి సంస్థ అధినేత్రి కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. నాంపల్లిలోని సింగరేణి భవన్ ముట్టడికి కల్వకుంట్ల కవితతోపాటు ఆ సంస్థ నాయకులు, హెచ్ఎంఎస్ నేతలు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వైపులా తోపులాట నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కవిత, పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జాగృతి జనం బాటలో భాగంగా కవిత జిల్లాలో పర్యటనలు చేస్తూ.. బీఆర్ ఎస్, ఆ పార్టీ పెద్దలపై మండిపడుతూ నేతల అవినీతిని ఎండగడుతున్నారు. తెలంగాణాలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని..కొత్త బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ ప్రధాన డిమాండ్‌తో సింగరేణి భవన్ ముట్టడి చేపట్టారు. సింగరేణిలో కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా డిపెండెంట్ ఉద్యోగాలను తీసేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
………………………………………………..
