
* ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
ఆకేరున్యూస్ వరంగల్: వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 13 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. రిజర్వుగా వారికి పోస్టింగ్
ఇచ్చారు,కొంత మందిని బదిలీ చేశారు. వరంగల్ లో పని చేస్తున్న ఎస్ వెంకన్నను తరిగొప్పుల ఎస్సైగా పోస్టింగ్ ఇచ్చారు. తరిగొప్పుల ఎస్ హెచ్ ఓ గా ఉన్న శ్రీదేవిని వరంగల్ సీసీఎస్ షీటీంకు బదిలీ చేశారు.
గీసుకొండలో పనిచేస్తున్న ఎస్ రాజును ముల్కనూర్ పీఎస్ కు బదిలీ చేశారు.ముల్కనూర్ ఎస్సైగా ఉన్నఎన్. సాయిబాబును వర్దన్నపేటకు బదిలీ చేశారు.వర్దన్నపేట ఎస్సై బి. చందర్ ను టాస్క్ ఫోర్స్‌కు బదిలీ
చేశారు.
వరంగల్ లో వీఆర్ గా ఉన్నా జి. అనిల్ కుమార్ ను గీసుకొండ ఎస్సైగా బదిలీ చేశారు. విజయ్ బాబును గీసుకొండకు బదిలీ చేశారు.వీఆర్ వరంగల్ లో ఉన్న ఎం. కుమార స్వామిని వర్దన్నపేట ట్రాఫిక్ ఎస్సైగా
బదిలీ చేశారు. బి, విజయ్ కుమార్ ను హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఇ. రతీష్ , హెచ్ ఆనందంల ను సీఎస్బీ వరంగల్ కు కేటాయించారు.వరంగల్ ట్రాఫిక్ విభాగంలో ఉన్న టి యాదగిరిని
సీసీఎస్ వరంగల్ కు బదిలీ చేశారు.అలాగే హనుమకొండ ట్రాఫిక్ లో ఉన్న ఇ నారాయణను వరంగల్ టీటీఐకి అటాచ్ చేశారు.
………………………………………….