
* ఏఐసీసీ అబ్జర్వర్ జాన్సన్ అబ్రహం
ఆకేరు న్యూస్, ములుగు: సంఘటన్ సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా డిసిసి అధ్యక్షుడు అన్ని వర్గాల ప్రజల ఏకాభిప్రాయం మేరకే నిర్వహించనున్నట్లు ఏఐసిసి అబ్జర్వర్ జాన్సన్ అబ్రహం తెలిపారు. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి PSR గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన ములుగు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐసీసీ అబ్జర్వర్ జాన్సన్ అబ్రహాం మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుల ఎన్నికకు అధిష్టానం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు .పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పార్టీ కోసం ఎంతో కష్టపడి పోరాటాలు చేసిన కార్యకర్తలు నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చి బాధ్యతాయుతమైన పదవులు ఇస్తుందన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. డీసీసీ ఎంపిక పారదర్శకంగా ఉంటుందని ఎవరైనా డీసీసీ పోటీలో ఉండవచ్చని ఈ ప్రక్రియలో ఎలాంటి లాబియింగ్ ఉండదని స్పష్టం చేశారు.అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ, ఓబీసీ, మహిళా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే దిశగా కృషి చేస్తుందన్నారు.పార్టీ కోసం కష్టపడేవారిని గుర్తించడంతోపాటు సమర్ధులైన నాయకులను ఎంపిక చేస్తామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి అందరి అభిప్రాయాలను సేకరించడంతోపాటు అభ్యంతరాలను కూడా పరిశీలిస్తామన్నారు.డిసిసి అధ్యక్ష పదవికి నామినేషన్ లను ప్రస్తుత జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి మల్లాడి రాం రెడ్డి,గొల్లపల్లి రాజేందర్ గౌడ్.ఇర్స వడ్ల వెంకన్న ,చిడం రామ్మోహన్ రావు,సూరపనేని నాగేశ్వర్ రావు లు నామినేషన్ అందజేశారు. అనంతరం మండల అధ్యక్షులు బ్లాక్ అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా సీనియర్ నాయకుల అభిప్రాయాలను అబ్జర్వర్ తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నాయకుల దగ్గర తీసుకున్న అభిప్రాయాలను టీపీసీసీ కి పంపుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి పరిశీలకులు సాగరికరావు.నాగేందర్ రెడ్డి తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
………………………………..