* తప్పిన పెను ప్రమాదం
* డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ ఆర్) ప్రయివేటు బస్సు బోల్తా పడింది. పెద్ద అంబర్‌పేట జంక్షన్ వద్ద అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీ కొట్టింది. దీంతో పక్కకు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణీకులున్నారు. అందులో ఆరుగురికి గాయాలవడంతో డీఆర్డీవో ఆపోలో, హయత్ నగర్ ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే మూల మలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యూగో ఎలక్ట్రికల్ బస్సుకు ప్రమాదం సంభవించింది. కర్నూల్ బస్సు ప్రమాదం మరువకముందే వరుస బస్సు ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వణికపోతున్నారు.
……………………………………….
