* సోషల్ మీడియా ఎఫెక్ట్
ఆకేరు న్యూస్ , డెస్క్ : నేపాల్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
సోషల్ మీడియా బ్యాన్ వల్ల దేశంలో తలెత్తిన పరిణామాల నేపధ్యంలో దేశ ప్రధాని
నేపాల్ ప్రధాని కే పీ శర్మ ఓలి ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే నేపాల్ హోం మంత్రి
రమేష్ లెఖక్, వ్యవసాయ మంత్రి రమ్నాథ్ అధికారి, ఆరోగ్య మంత్రి ప్రదీప్ పౌడెల్లు రాజీనామా చేశారు.నేపాల్‌లో జెన్ జెడ్ (Gen Z) యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు దేశ రాజకీయాలను తలకిందులు చేశాయి. ఈ నేపధ్యంలో చూస్తే సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందో
తెలుస్తోంది. దేశ రాజకీయాలను శాసించేస్థితికి సోషల్ మీడియా చేరిందని తెలుస్తోంది
ఈ పరిణామాలను గమనిస్తే ఇది భవిష్యత్ కు మంచిదా చెడ్డదా
అనే ది ప్రశ్నార్థకంగా మారింది.
నేపాల్ ప్రధాని ఓలీ నివాసానికి నిప్పు..
నేపాల్ లో పరిస్థితి చేయిదాటిపోయింది. సోషల్ మీడియాపై విధించిన బ్యాన్‌ను ఎత్తివేసినప్పటికీ నిరసనలు ఆగడం లేదు. వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని కేపీ ఓలి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని కాఠ్మాండూలోని పార్లమెంట్ వద్ద రోడ్లను దిగ్బంధించారు. పలువురు మంత్రులు, రాజకీయ నేతల ఇళ్లను ముట్టడిస్తున్నారు. మరోవైపు రాజధానిలోని ప్రధాని ఓలి అధికారిక నివాసాన్ని నిరసనకారులు ముట్టడించారు. ఇంట్లోకి చొరబడి ధ్వంసం చేశారు. అంతేకాదు ఆ ఇంటికి నిప్పుపెట్టారు హోం మంత్రి రమేశ్ లేఖక్ నివాసానికి నిప్పంటించారు.నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా నివాసాన్ని చుట్టు ముట్టారు. ఆయనకు సంబంధించిన ఆస్తులకు నిప్పు పెట్టారు.
దుబాయ్‌కి వెళ్లనున్న ప్రధాని కే పీ శర్మ ఓలీ
కొద్ది సేపటి క్రితమే నేపాల్ ప్రధాని కేపీ శర్మ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త ప్రధానిని ఈ రోజు సాయంత్రం ఎన్నుకోనున్నట్లు తెలిసింది. కేపీ శర్మ ఓలి దుబాయ్ కి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
………………………………………….
