ఆకేరు న్యూస్,హుజురాబాద్ : వ్యవసాయ కూలీలతో ప్రయాణిస్తున్న ఆటో ట్రాలీ డివైడర్ను ఢీకొట్టడంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామ బస్టాప్ వద్ద హుజురాబాద్ – పరకాల ప్రధాన రహదారిపై గురువారం ఉదయం ట్రాలీ ఆటో అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ట్రాలీలో ప్రయాణిస్తున్న 8 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కందుగుల గ్రామం నుంచి భీంపల్లి గ్రామానికి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
………………………………………………