* ఆ దేశ అధ్యక్షుడు, ఆయన సతీమణి మా కస్టడీలో
* అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, డెస్క్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులాపై దాడులు చేసింది తామేనని వెల్లడించారు. కాసేపటి క్రితం వెనిజులా రాజధానిలో భారీ పేలుళ్లు సంభవించాయి. డ్రగ్స్ కేంద్రంగా వెనిజులా మారిందని, అందుకే ఈ దాడులు అన్నారు. వెనిజులా అధ్యక్షుడు, ఆయన భార్యను సిలియా ఫ్లోర్స్‌ను తమ కస్టడిలోకి తీసుకున్నామని ప్రకటించారు. వారిద్దరినీ ప్రస్తుతం వెనెజువెలా వెలుపలకు తరలించినట్లు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ (Truth) సోషల్‌మీడియాలో వెల్లడించారు. శనివారం తెల్లవారు జామున 2 గంటలకు ఆ దేశ రాజధాని కరాకస్ పరిసర ప్రాంతాల్లోని ఏడు చోట్ల భారీ పేలుళ్లు జరిపింది. అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ చేపట్టిందని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇదిలాఉండగా, మరోవైపు తమ అధ్యక్షుడుని, ప్రథమ మహిళను అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై వెనుజువెలా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్స్ స్పందించారు. ప్రస్తుతం వారిద్దరూ ఎక్కడ ఉన్నారో తమకు తెలియదన్నారు. అయితే వారిద్దరూ సజీవంగా ఉన్నారో, లేదో తెలియజేయాలని, అందుకు తగిన ఆధారాలు చూపాలని అగ్రరాజ్యం అమెరికా(America)ను డిమాండ్ చేశారు.
……………………………………………

