
* రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
* వివాహ కార్యక్రమానికి వెళ్లొస్తుండగా ఘటన
ఆకేరు న్యూస్, డెస్క్ : వివాహ కార్యక్రమానికి హాజరై.. తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాధాన్ని నింపింది. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ కారు అదుపుతప్పి డివైడర్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివపురి జిల్లా రిజోడా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గుణ జిల్లాలోని మావాన్లో ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భదౌరా పట్టణానికి (Bhadaura town) సమీపంలోకి రాగానే రోడ్డుపై పశువులను తప్పించబోయే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి (Car Hits Divider) బోల్తా పడింది. ఈ ఘటనలో గోవింద రఘువంశీ (28), సోనూ రఘువంశీ (35), వీరు కుశ్వాష్ (24), హితేశ్ బైరాగి (24) మృతి చెందారు. వీరంతా రిజోడాకు చెందిన వారిగా మైనా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి గోపాల్ చౌబే తెలిపారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరిని మెరుగైన వైద్యం కోసం భోపాల్ తరలించారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
……………………………….