* బీఆర్ ఎస్ మాజీ మంత్రి సంచలన ఆరోపణలు
ఆకేరు న్యూస్, తిరుపతి : తెలంగాణకు చెందిన భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివక్ష చూపుతోందని, బీఆర్ ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (EX MINISTER SRINIVASGOUD)సంచలన ఆరోపణలు చేశారు. గత పదేళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదని, దీన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సరిచేయాలని సూచించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ(TELANGANA) ప్రజలకు ఆంధ్రప్రాంతంతో ఉన్న ఏకైక సంబంధం తిరుపతి అని తెలిపారు. తెలంగాణలో పుట్టిన ప్రతీబిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలని భావిస్తారన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అందరికీ ఒకేలా సేవలు అందేవని, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా అది కొనసాగిందని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అలా లేవన్నారు. తెలంగాణ భక్తులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలపై వివక్ష చూపుతున్నట్లు ఉందన్నారు. శ్రీవారి దర్శనం, గదుల విషయంలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు(CHANDRABABU) దీన్ని సరిచేయాలని కోరారు.
………………………………………………