
* బీసీల ఆత్మగౌరవమే నినాదం
* హోటల్ తాజ్ కృష్ణలో అనుచరులతో భేటీ
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : సెప్టెంబర్ 17 తెలంగాణకు ప్రత్యేక మైన రోజు.. నిజాం పాలన నుంచి విముక్తి పొందిన దినం.. అదే సెప్టెంబర్ 17న తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల ఆత్మగౌరవమే నినాదంగా కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో తీన్మార్ మల్లన్న తన అనుచరులతో భేటీ కానున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలనుంచి బీసీ నాయకులు, తీన్మార్ మల్లన్న అభిమానులు హోటల్ తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా బీసీల ఆత్మగౌరవ జెండా రెపరెపలాడే రోజు రానుందని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. తెలంగాణ లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.బీసీలు తమకు తాముగా రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. నేడో రేపో పార్టీ పేరు ఖరారు చేసి పార్టీ విధి విధానాలను ప్రకటిస్తామని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. స్థానిక సంస్థలు సమీపిస్తున్న నేపధ్యంలో స్థానిక ఎన్నికల్లోనే బీసీల సత్తా చాటే వ్యూహంలో తీన్మార్ మల్లన్న ఉన్నట్లు రాజకీయ విశ్లేలకులు భావిస్తున్నారు.
…………………………………….