ఆకేరున్యూస్, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి – బొమ్మపల్లి చౌరస్తాలో ఇన్నోవా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. వారు యాదగిరిగుట్ట దర్శనం అనంతరం హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
……………………………………….