
ఆకేరు న్యూస్ మెదక్ : అదుపు తప్పిన కారు చెట్టుకు ఢీ కొనడంతో ఓ మహిళతో పాటు డ్రైవర్ మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా (MEDAK DISTRICT)లో చోటుచేసుకుంది.శివ్వంపేట్ ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శివ్వంపేట గ్రామానికి చెందిన బాలమణి (70) కారులో నర్సాపూర్ (NARSAPUR)కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారు చిన్నగొట్టి ముక్ల గ్రామం వద్ద అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలమణితో పాలు డ్రైవర్ ఆంజనేయులుఅక్కడికక్కడే చనిపోయారు. వీరిద్దరూ సీటు బెల్టు పెట్టుకుని ఉంటే ప్రాణాపాయం నుంచి బయట పడే అవకాశాలు ఉండేవని ఎస్సై తెలిపారు. డ్రైవర్ ఆంజనేయులుది నర్సాపూర్ మండలం లింగాపూర్ లని ఎస్సై వెల్లడించారు. ఇద్దరి మృత దేహాలను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్సై తెలిపారు.
………………………………………..