* మృతుల్లో కడారి సత్యానారాయణ రెడ్డి అలియాస్ కోసా, కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చత్తీష్ గడ్‌లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. సీపీఐ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు ఇద్దరు మృతి చెందారు. మృతుల్లోకడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా 67, కట్టా రాం చంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా ( 63 ) లు ఉన్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎకే -47, ఇన్సాస్ రైఫిల్ , గ్రెనేడ్ లాంచర్ లాంటి ఆయుధాలు లభ్యమైనట్లు ప్రకటించారు. ఇంకా ఎన్ కౌంటర్ జరుగుతున్నందున మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. కాగా కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలానికి చెందిన వారు . కట్టా రాం చంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా సిద్ది పేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లికి చెందిన వారు. రాంచంద్రారెడ్డి చత్తీష్ గడ్‌లో ఎల్ఎల్ బీ కోర్సు కూడా పూర్తి చేశాడంటున్నారు. అంతేకాకుండా చాలా కాలం పాటు హిందీ దినపత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేశాడని మాజీ మావోయిస్ట్‌లు అంటున్నారు. 1988-89 కాలంలో హనుమకొండ రెడ్డి కాలనీ లో జరిగిన ఎన్ కౌంటర్ లో అప్పటి పీపుల్స్ వార్ నేత దగ్గు రాజలింగు ఈ ఎన్ కౌంటర్లో మృతి చెందారు. అప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కట్టా రాంచంద్రారెడ్డికి సంబందించిన స్కూటర్ దగ్గు రాజలింగు ఉపయోగించినట్లుగా సమాచారం. దీంతో కట్టా రాంచంద్రా రెడ్డి సైతం అడవి బాట పట్టినట్లుగా చెబుతున్నారు..
——————————————
