
* జమ్ముకశ్మీర్లో పరిస్థితులపై రాజ్నాథ్ సమీక్ష
ఆకేరు న్యూస్, డెస్క్ : జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) బారాముల్లా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎల్వోసీలో చొరబాటుకు యత్నించిన వారికి భద్రతా దళాలు హతమార్చాయి. బారాముల్లా జిల్లాలోకి చొరబడిన మిగతా ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రక్షణ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) సమావేశమయ్యారు. సమావేశంలో జాతీయ భద్రత సలహాదారులు అజిత్ ఢోబాల్ పాల్గొన్నారు. చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీసింగ్ పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్లో భద్రతా చర్యలపై చర్చించారు.
………………………………………………..