
* ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : నాటు నాటు సాంగ్ ప్రపంచమంతా ఒక ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ లో చరణ్, ఎన్టీఆర్ కాళ్లతో వేసిన స్టెప్ అయితే ప్రపంచమంతటా వైరల్ అయింది. అనేక దేశాల నుంచి అభిమానులు ఈ నాటు నాటు సాంగ్ (Naatu Naatu Son) కి స్టెప్పులు వేసి మరీ ఆ వీడియోల్ని సోషల్ మీడియాల్లో వైరల్ చేశారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా నాటు నాటు సాంగ్ అందరి కాళ్ళు కదిలించి స్టెప్ వేసేలా చేసింది. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే మార్చి 12న ఈ సాంగ్ కు ప్రపంచ ప్రఖ్యాత అవార్డు ఆస్కార్ (Ascar)వచ్చింది. ఈనేపథ్యంలో 2ఇయర్స్ బ్యాక్.. దేశం దద్దరిల్లిన మూమెంట్ అంటూ.. డీవీవీ ఎంటర్ టైన్మెంట్ ట్విటర్ ఎక్స్ లో రాంచరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ ను పోస్ట్ చేసింది. కాగా, నాటు నాటు పాటని లిరికిస్ట్ చంద్రబోస్ రాయగా, కీరవాణి సంగీత దర్శకత్వంలో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.
………………………………………….