
– అక్కడి పరిస్థితులపై వైద్య శాఖ ఆరా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలోనే పేదల పెద్దాస్పత్రిగా పేరొందిన గాంధీ ఆస్పత్రి(GANDHI HOSPITAL)ని సమస్యలు వెంటాడుతున్నాయి. కనీసం రోగులు, సహాయకులకు తాగేనీళ్లు కూడా లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన అధికారులు తక్షణం నీటి సదుపాయం కల్పించారు. ఆస్పత్రిలో దాతలు ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంటును మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ దుస్థితి ఎందుకు తలెత్తిందో తెలుసుకోవడానికి గాంధీ ఆస్పత్రిలో ఈరోజు రాష్ట్ర వైద్య శాఖ సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ నరేందర్ కుమార్ (DR. NARENDRA KUMAR) ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తక్షణం అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూపరింటెండెంట్ రాజకుమారికి సూచించారు. కాగా, గాంధీ ఆస్పత్రిలో వైద్యుల వసతి గృహంలో కూడా మంచినీటి కొరత ఉందంటూ ఆస్పత్రికి వచ్చిన డీఎంఈ డాక్టర్ నరేందర్‌కు జూడా అధ్యక్షుడు అజయ్ కుమార్‌తో పాటు ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం రాత్రి నుంచి మంచినీటి సమస్యతో వైద్యులమైన తామ ఇబ్బందులు పడుతున్నామని డీఎంఈ (DME) దృష్టికి తీసుకొచ్చారు.
……………………………………………..