
* సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించండి.
* RARS వరంగల్ సైంటిస్ట్ Dr. హరి
ఆకేరు న్యూస్, కమలాపూర్: వివిధ గ్రామాలకు శాస్త్రవేత్తలను పంపించి రైతులను,ప్రజలను చైతన్య పరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా గురువారం కమలాపూర్ మండలంలోని రైతు వేదికలో అవగాహన కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి యం.రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు, నకిలీ విత్తనాల బారిన పడకుండా తీసుకొనవలసిన జాగ్రత్తలను, విత్తనాలను విత్తేటప్పుడు పాటించవలసిన పద్ధతులను రైతులకు వివరించారు. అనంతరం వ్యవసాయ పరిశోధనా స్థానం (RARS)వరంగల్ సైంటిస్ట్ డాక్టర్ హరి మాట్లాడుతూ వరి పంటలో స్వల్పకాలిక పంట రకాలైన RNR15048, KNM 1638 గురించి వివరించారు. నేల సారం పెంచేందుకు గాను సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని,కెమికల్ ఎరువులైన యూరియా వాడకాన్నీ తగ్గించటం, సస్యరక్షణ, పంట మార్పిడి తదితర అంశాల పట్ల రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి, వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య ,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,అగ్రికల్చర్ టెక్నికల్ ఆఫీసర్ డీ.శ్రీధర్ రెడ్డి,ఏఈఓ లు ప్రశాంత్, జయప్రకాష్, రహీమ్,రైతులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………