* బాధితులను పరామర్శించిన సీతారామన్
ఆకేరున్యూస్, డెస్క్ : తమిళనాడులోని కరూర్ పట్ణంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కరూర్‌లో శనివారం రాత్రి నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో నిర్మలా సీతారామన్ కరూర్ లో ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఘటన జరిగినతీరు ను ఘటనకు సంబంధించిన వివరాలను అడిగితెలుసుకున్నారు. ఈ ఘటనలో 41 మంది చనిపోగా 50 మందికి పైగా గాయపడ్డారు.తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలతో ఆమె మాట్లాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నక్షత గాత్రులను పరామర్శించారు. నిర్మలా సీతారామన్ వెంట కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ కూడా బాధితులను పరామర్శించారు.మృతుల కటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున, తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున, కేంద్రం రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
……………………………………..
