
* సీరియస్‌గా తీసుకున్న పోలీసు అధికారులు
ఆకేరున్యూస్, వనపర్తి: కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి (సీసీసీ) గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే మూడుసార్లు గుర్తుతెలియని వ్యక్తి వచ్చి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే సీసీసీ సెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ ప్రచారం చేసుకుంటూ సదరు వ్యక్తి సీసీసీ సెంటర్లో సంచరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ ఫేక్ ఉద్యోగి జ్ఞాన సాయి ప్రసాద్‌గా విచారణలో బయటపడిరది. జ్ఞాన సాయి ప్రసాద్ సీసీసీ సెంటర్ ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వ్యాపార లావాదేవీల పేరుతో గోవర్ధన్ అనే వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. గోవర్ధన్ నుంచి జ్ఞాన స్థాయి ప్రసాద్ మూడు లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వెళ్లడాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.
…………………………………………