* పోటెత్తిన వరదనీరు
* ప్రమాదకర స్థాయికి చేరుకున్న హుసేన్ సాగర్
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ పరిస్థితి అతలాకుతలంగా మారింది. హుసేన్ సాగర్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నగరంలో ఉన్న నాలాల ద్వారా సాగర్ లోకి వరదనీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లుగా ప్రస్తుత నీటిమట్టం 513.63 మీటర్లుగా ఉన్నట్లు చెప్పారు. ఇన్ఫ్ ఫ్లో 1530 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1525 క్యూసెక్కులుగా ఉన్నట్లు వివరించారు. కూకట్ పల్లి, బంజారా, పికెట్, బుల్కాపూర్ నాలాల నుంచి భారీగా వరదనీరు వస్తోంది.ఈ నేపథ్యంలో తూముల ద్వారా మూసీలోకి వరద నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు . దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ ఎంసీ అధికారులు హెచ్చరించారు. అత్యవస పరిస్థితి వస్తే సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.
………………………………………………
