
* తాసిల్దార్ కు మెమోరాండం అందజేసిన బిజెపి నాయకులు
ఆకేరు న్యూస్, ములుగు: తాడువాయి మండలంలో గల అపరిస్కృత సమస్యలు పరిష్కరించాలంటూ బిజెపి నేతలు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మణ్ ఆధ్వర్యంలో అందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల రాంబాబు హాజరై మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ ల అబద్ధాల మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీర్చగా పోగా కనీసం మండలం లో ఉన్నటు వంటి సమస్యలు ఐన ప్రతి గ్రామంలో సైడు కాలువలు నిర్మిచ్చకపోవటం, నిర్మించిన వాటిపై నిర్వహణ లేకపోవడం తో దోమలు ఈగలు పెరిగి ఈ కాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు .వాటి నిర్వహనను సక్రమంగా చేపట్టాలని కోరారు. మండలం లో ఎక్కడైతే రోడ్లు లేని ప్రాంతాలలో త్వరిత గతిన రోడ్లు నిర్మిచాలని తాడ్వాయి మండలం ఆటవి ప్రాంతం అయినందున స్థానిక హెల్త్ సెంటర్లల్లో వైద్యులు, సిబ్బంది, ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్టు చూడాలని కోరారు . జంపన్న వాగు నుండి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి భర్తపురం నరేష్ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జంగా హన్మాంతరెడ్డి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదరి శ్రీకాంత్ మండల ప్రధాన కార్యదర్శి చెంగల సుభాష్ మరియు మండల నాయకులు పోరిక వెంకట్రాం సేనాపతి చెవుగాని రఘబాబు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
…………………………………