
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి కోడలు ,హీరో రాంచరణ్ సతీమణి ఉపాసన పులిపిల్లను దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న నెహ్రూ జువాలజికల్ పార్కును తన కుమార్తెతో కలిసి ఉపాసన సందర్శించారు. జూ అంతా తిరిగి ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవలే జన్మించిన పులిపిల్లను ఉపాసన దత్తత తీసుకున్నారు. పులిపిల్ల పోషణకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని ఉపాసన జూ అధికారులకు తెలిపారు. ఈ మేరకు ఆమె జూ అధికారులకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా జూ అధికారులు పులిపిల్లకు కింకారా అని పేరుపెట్టారు. ఉపాసన రాంచరణ్ ల కూతురి ముద్దు పేరు కూడా కింకారానే…
………………………………………………….