
* వ్యవసాయ శాఖ అధికారులు స్వాధీనం
ఆకేరు న్యూస్ డెస్క్ : అక్రమంగా నిల్వ ఉంచిన 26 యూరియా బస్తాలను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలో PACS డైరెక్టర్ దొంతరబోయిన యాదగిరి ఇంట్లో అక్రమంగా యూరియా బస్తాలు నిలువ ఉన్నాయన్న సమాచారం మేరకు వ్యవసాయ అధికారుల తనిఖీ చేయగా 26 యూరియా బస్తాలు ఇంట్లో నిల్వ ఉన్నాయి. అక్రమంగా నిల్వ ఉంచిన యూరియా బస్తాలను స్వాధీనం చేసుకొని యాదగిరిపై సెక్షన్ 6ఏ కింద కేసు నమోదు చేశారు.
………………………………………