
* ఎరువుల కేంద్రం వద్ద రైతుల తిప్పలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ప్రతీ రోజూ తెల్లవారు ఝామునుండే ఎరువుల కేంద్రాల వద్దకు చేరుకొని క్యూలైన్లలో పడిగాపులు పడుతున్నారు. గంటల తరబడి లైన్లలో ఉంటున్న రైతులకు ఒక్కొక్కరికీ కేవలం ఒకే బస్తా ఇస్తున్నారు. దీంతో పంటలకు సరిపడా యూరియా ఇవ్వడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొంతమంది రైతులకు మాత్రమే టోకెన్లు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు యూరియాను బ్లాక్లో కొనేందుకు రైతులు ముందుకు వచ్చే పరిస్థితి నెలకొంది. యూరియాతో పాటు ఇతర వస్తువులను కూడా రైతులకు అంటగట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అవన్నీ బ్లాక్ మార్కెట్కు తరలిపోయి రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
………………………………………………