
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి
* కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : దేశంలో యూరియా కొరత ఏర్పడింది వాస్తవమేనని రైతులు సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం యూరియా వినియోగం పెరిగిందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురియడం వల్ల పంటలు ఎక్కువ విస్తీర్ణంలో వేశారని అందుకు తగిన యూరియా లభ్యం కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. దేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకుంటున్నా కూడా మన దేశంలో యూరియా ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.ఈ ఏడాది 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందజేశామని తెలిపారు.యూరియాను అందుబాటులో పెడతాం, సరఫరా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
జైలుకు వెళితే పదవినుండి తప్పుకోవాలి
ఆరోపణలతో జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే స్వచ్చందంగా పదవినుండి తప్పుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. గతంలో జైలుకు వెళ్లిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరు నెలలకు పైగా జైలులో ఉండి అక్కడి నుండే అధికారులతో రివ్యూమీటింగ్ లు ఏర్పాటు ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కొంత మంది రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నైతిక విలువలు కాపాడేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోందని అన్నారు. ఈ బిల్లు పై జేఏసీ తో పాటు న్యాయనిపుణుల , మేధావుల సలహాలు అభిప్రాయాలను తీసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు.
……………………………………………