
* కేటీఆర్ పుట్టినరోజున హెల్మెట్ల పంపిణి
ఆకేరు న్యూస్, జనగామః ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్లు తప్పనిసరిగా వాడాలని, ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజును పురస్కరించుకుని పాలకుర్తిలో ద్విచక్ర వాహానదారులకు హెల్మెట్లను పంపిణి చేశారు. అంతకు ముందు రాజీవ్ చౌరస్తాలో కేక్ కట్ చేసి బీ ఆర్ ఎస్ నాయకులు ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ద్విచక్ర వాహానదారులు అతివేగంతో ప్రయాణం చేసి ప్రమాదాల భారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. ప్రాణాలు ఎంతో విలువైనవి.. కుటుంబ యజమానులు కానీ, పిల్లలు కానీ జాగ్రత్తగా ఇంటికి చేరిన్పుడే కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారని అన్నారు. అతివేగం ప్రమాదకరమని, ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తతో వాహానాలను నడిపితే అందరు సంతోషంగా ఉంటారని అన్నారు. మద్యం సేవించినా, సెల్ఫోన్ చూసుకుంటూ, మాట్లాడుకుంటూ వాహానాలు నడిపినా, అతివేగంతో వెళ్లినా ఎమైన జరగాని ఘోరం జరిగితే ఆ కుటుంబంలోని అందరు వీదిన పడుతారని అన్నారు. హెల్మెట్లు ధరిస్తే ప్రమాదాలను నివారించవచ్చని, ఏదైనా ప్రమాదం జరిగితే చిన్నచిన్న గాయాలతో ప్రాణాలను దక్కించుకోవచ్చని హితువు పలికారు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహానదారుడు హెల్మెట్లను కేవలం పోలీసులు ఫైన్ వేయకుండా తప్పించుకోవడానికే వాడకుండా, తన ప్రాణాల భద్రతకు వాడాలని అన్నారు. దేవరుప్పుల మండలంలోను కేటీఆర్ జన్మదిన వేడుకులు స్థానిక బీ ఆర్ ఎస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. పెద్ద వంగర, కొడకండ్ల మండల కేంద్రాల్లోను కే టీ ఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుకున్నారు.
…………………………………….