* పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులు
ఆకేరు న్యూస్, డెస్క్: అది చాలా విలువైన డైమండ్ నెక్లెస్. ఇంట్లోని అల్మారాలో భద్రంగానే ఉందనుకున్నారు. ఇంటి సామాన్లు సర్దుతున్న క్రమంలో అల్మారా తెరిచిచూడగా డైమండ్ నెక్లెస్ కనిపించకపోవడంతో ఆమె నిర్ఘాంతపోయింది. నగరానికి చెందిన సాకేత్ రామారావు కుటుంబంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లోని ఆర్బీఐ ప్రణవ్ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ నెంబర్ 202లో నివసిస్తున్నారు. ఈ నెల 26న ఆయన భార్య ఇల్లు సర్దుతుండగా కబోర్డ్ లో ఉండాల్సిన డైమండ్ నెక్లెస్ కనిపించ కుండా పోయింది. అన్ని చోట్లా వెదికినా కనిపించ లేదు. దీంతో ఆ దంపుతలు బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరిసారిగా నెక్లెస్‌ను సెప్టెంబరు 26 న చూసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి పనిమనుషులపై అనుమానం వ్యక్తం చేశారు.
అసలు నగలు దాచి నకిలివి పెట్టి..
నగలు కొనేందుకు వచ్చి నట్టు నటిస్తూ బంగారు చెవి పోగులు చోరీ చేసి వాటి స్థానంలో పాత వాటిని పెట్టిన ముగ్గురు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశార. షేక్‌పేట్ ఓయూ కాలనీ లో ఉన్న సుజాని జ్యువెలరీకి ఈ నెల 26 న ముగ్గురు తెలియని మహిళలు వచ్చారు. నగలు చూపించాలని కోరారు. సేల్స్‌మన్ చెవి పోగుల చెవిపోగులు చూపించాడు. 10 గ్రాముల విలువైన అసలు బంగారు చెవిపోగులను తీసి వాటి స్థానంలో నకిలీ పోగులను పెట్టి మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపటికి నకిలీ చెవి పోగులు కనిపించడంతో జరిగిన మోసం తెలిసింది. దుకాణ యజమాని సుధీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలు ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
……………………………………
