
ఆకేరున్యూస్ : క్యాథలిక్ క్రైస్తవ మఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరణానంతరం పోప్ ఫ్రాన్సిస్ తొలి ఫొటోను వాటికన్ అధికారులు తాజాగా రిలీజ్ చేశారు. ఓపెన్ శవపేటికలో పోప్ ఫ్రాన్సిస్ పడుకుని ఉండగా.. వాటికన్ విదేశాంగ కార్యదర్శి ప్రార్థనలు చేస్తూ కనిపించారు. శుక్రవారం, ఆదివారం మధ్య పోప్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు వాటికన్ అధికారులు తెలపగా.. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల అంశంపై చర్చించేందుకు మంగళవారం రోమ్‌లో కార్డినల్స్ భేటీ జరగనుంది. అలాగే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొననున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు.
………………………………………….