
* వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం
ఆకేరున్యూస్, హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం పశువైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్వ అన్నారు. జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా బుధవారం వడ్డేపల్లిలోని పశువైద్యశాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారితో కలసి కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ, పశు సంపద అనేది ఎంతో విలువతో కూడుకున్నదని అన్నారు. గతంలో పశుసంపద పశువులు, గొర్రెలు, మేకలు, ఆవులను ఒక ఆస్తిగా చెప్పుకునే వాళ్లని ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం బాధాకరం అన్నారు. పాడి రైతులు పశు సంపదపై దృష్టి సారించి ఆర్థికాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పాడి రైతులు పశువుల వ్యాధుల పట్ల అవగాహన లేకపోవడం వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోవడం, అకాల మరణాలు సంభవించడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. అలాంటి నష్టాలు జరగకుండా పాడి రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పశువులకు ఇప్పించి పశు సంపాదన కాపాడుకోవాలనిఎంపీ సూచించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కల్పిస్తున్న అవకాశాలను పాడి రైతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాడి రైతులు పశు సంపదపై దృష్టి సారించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.పశుసంవర్ధక శాఖ ఇలాంటి అవగాహన కార్యక్రమాలను మరిన్ని చేపట్టి పాడి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పశుసంవర్ధక శాఖ సమస్యలపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రాధాకృష్ణ, వైద్యులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………….