
* భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సవిూక్ష
ఆకేరున్యూస్, హైదరాబాద్: మార్చి 2న రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తగిన ఏర్పాట్లపై ప్రభుత్వ సీఎస్ శాంతి కుమారి ఉన్నతాధికారులతో శుక్రవారం సచివాలయంలో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కాగా ఉపరాష్ట్రపతి హైదరాబాద్లోని ఐఐటిని సందర్శించి అక్కడి అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో ముచ్చటిస్తారని సిఎస్ తెలిపారు. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కూడా పాల్గొని అదే రోజు తిరిగి వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సి.ఎస్ సూచించారు. ఆర్ అండ్ బి శాఖ, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వైద్యారోగ్య శాఖకు అర్హులైన వైద్యులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని సూచించారు. అదేవిధంగా, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖకు తెలిపారు.
………………………………