
* పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి
* పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశం
* స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు
ఆకేరున్యూస్ రాయపర్తి : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచితీరుతుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె పాలకుర్తి మండల కేంద్రంలో రాయపర్తి మండల ముఖ్య నాయకులతో కలిసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకం అన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు ఒక టీమ్‌గా పనిచేయాలన్నారు ప్రతి గ్రామంలో, ప్రతి బూత్ స్థాయిలో కాంగ్రెస్ బలాన్ని పెంచి, అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించా,లని పిలుపునిచ్చారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని కోరారు. గ్రామీణ ప్రజల నమ్మకం గెలుచుకోవడమే మన విజయమని అన్నారు. సమన్వయంతో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీని ఓడించే శక్తి ఎవరికీ లేదని ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి అన్నారు.సమావేశంలో బ్లాక్ మరియు రాయపర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ టీపీసీసీ కార్యదర్శులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యువకార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………